భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు బీహార్ రాష్ట్ర రాజధానిలోని గంగా నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదిలో నీటిమట్టం భారీగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాట్నా జిల్లాలో పలు పాఠశాలలను అధికారులు మూసివేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 76 ప్రభుత్వ పాఠశాలలను ఆగస్టు 31 వరకు మూసివేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం అధికారులు వెల్లడించారు.