విభిన్నంగా ప్రయత్నించాలని కొందరు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇదే కోవలో ఓ మహిళ రైల్వే ట్రాక్‌పై ఫొటోలు దిగింది. అదే సమయంలో రైలు వస్తున్నా ఆమె పట్టించుకోలేదు. ట్రైన్ దగ్గరకు వచ్చాక ఆ మహిళను లోకోపైలట్ కాలితో తన్నాడు. దీంతో ఆ మహిళ రైల్వేట్రాక్ దిగిపోయింది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. అయితే ఆ లోకోపైలట్ సరైన పని చేశాడని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.