VIDEO: దొంగను ఢీకొట్టిన బస్సు

53చూసినవారు
బ్రెజిల్‌లోని సావోపాలోలో ఇటీవల విషాద ఘటన జరిగింది. 71 ఏళ్ల వృద్ధుడు ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డుపై నడుస్తున్నాడు. ఆయన ఫోన్‌ను ఓ దొంగ లాక్కుని పరారయ్యాడు. అయితే అటుగా ఓ బస్సు దూసుకొచ్చింది. గమనించకుండా రోడ్డుపై పరుగెత్తిన దొంగను బస్సు ఢీకొట్టింది. దీంతో ఆ దొంగ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్