VIDEO: కుక్క కోసం బాలుడిని కొట్టి.. లిఫ్ట్‌ నుంచి వెళ్లగొట్టిన మహిళ

60చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో షాకింగ్ ఘటన జరిగింది. ఒక బాలుడు లిఫ్ట్‌లో ఉన్నాడు. ఒక మహిళ తన పెంపుడు కుక్కతో లిఫ్ట్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించింది. అయితే ఆ కుక్కను చూసి ఆ బాలుడు భయపడ్డాడు. దానిని లిఫ్ట్‌లోకి తీసుకురావద్దని ఆ మహిళను ప్రాధేయపడ్డాడు. ఆగ్రహించిన ఆమె ఆ బాలుడ్ని లిఫ్ట్‌ నుంచి బయటకు తోయడంతోపాటు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్