ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి విందు ఆలస్యంపై వరుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది ఘర్షణకు తీవ్ర దారి తీసింది. దీంతో కొట్టుకోవడంతోపాటు కుర్చీలు విసురుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.