ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లా దారుణ ఘటన చోటుచేసుకుంది. తార్కుల్వా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఓ మహిళను కిందపడేసి ఆమె అత్తమామలు కర్రలతో దారుణంగా కొట్టారు. బాధితురాలైన అలీమా ఖాతున్‌ను ఆమె అత్తగారు, మామగారు, బావమరిది చిత్రహింసలు పెట్టారు. కుటుంబ గొడవల కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.