ఏఐతో మారిపోయిన హీరోయిన్ల వాయిస్ (వీడియో)
ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియాలో చాలా రకాల మార్ఫింగ్ వీడియోలు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఏఐ సాయంతో హీరోయిన్ల వాయిస్ లను మిమిక్రీ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. 'యానిమల్' ఫేమ్ త్రిప్తి దిమ్రీ వాయిస్ ను కియారా అద్వానీ, పరిణీతి చోప్రా, కృతి సనన్ గొంతులుగా మార్చారు. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ఏఐ రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోందని అంటున్నారు.