విజయ్ కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ నుంచి ‘విజిలేస్కో’ అంటూ సాగే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను యువన్ శంకర్‌రాజా, నక్ష అజీజ్ ఆలపించారు. సెప్టెంబరు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.