రాజధాని అమరావతి అభివృద్ధి ద్వారా విజయవాడకు మళ్లీ పూర్వ వైభవం, చైతన్యం వస్తుందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. విజయవాడ నిడమానూరులో నిర్వహించిన వెంకయ్యనాయుడు జన్మదిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రజాజీవితంలో తన మొదటి అడగులు పడింది విజయవాడలోనేనని చెప్పారు. స్వరాజ్య మైదానంతో తనకు ఎంతో అనుబంధం ఉందని.. ఇప్పుడు స్వరాజ్యం వచ్చింది కాబట్టి మైదానం తీసేసినట్టు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.