వికారాబాద్ జిల్లా, దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామం లో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తన స్వంత నిధులతో ప్రధాన చౌరస్తా పండగల సాయన్న, వివేకానంద విగ్రహాల దగ్గర హైమాస్ట్ వీధిలైట్లను బుధవారం ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడిగిన వెంటనే వీధి దీపాలకు తమ నిధులు కేటాయించినందుకు ఎమ్మెల్యేకు మోత్కూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధన్యవాదాలు తెలియజేశారు.