కొడంగల్ మండలంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా శనివారం స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రక్తదాన శిబిరంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని మండలాల్లో యువత ముందుకు వచ్చి రక్త దాన శిబిరంలో పాల్గొనాలని తెలిపారు. మీరు ఇచ్చే రక్తం మరొకరి జీవితాన్ని కాపాడుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.