రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయడంతో మద్దూరు మండల కేంద్రంలో రైతులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు దండ వేశారు. ఈ విషయాన్ని గమనించిన ఓ రైతు మోటార్ సైకిల్ ఆపి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఉన్న దండను తీసివేశారు. బ్రతికి ఉన్న వ్యక్తుల చిత్రపటాలకు దండలు వేయడం మంచిది కాదు అని ఈ సందర్భంగా రైతు అన్నారు.