మేడ్చల్: భూములు కోల్పోయిన బాధితులను పరామర్శించిన ఎంపీ
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెన్నాపురం చౌరస్తా నుండి బీజేఆర్ నగర్ వరకు 100 ఫీట్ల రోడ్డు విస్తరణలో ఇంటి స్థలాల భూములు నష్టపోయిన బాధితులను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ శనివారం పరామర్శించారు. నాయకులు చెప్పారు కదా అని అధికారులు పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అధికారులను హెచ్చరించారు.