ప్రత్యేక బస్సులను వినియోగించుకోండి: డిపో ఎండీ
దసరా పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే కాలేజీ, హాస్టల్ మహిళలు, విద్యార్థులు సౌకర్యార్థం 30 నుండి 40 మందితో బస్సులు నడుపుతామని మేడ్చల్ డిపో మేనేజర్ ఎ. సుధాకర్ తెలిపారు. ఒక రోజు ముందుగా తెలియజేస్తే రాష్ట్రంలోని నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, నల్గొండకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. మహాలక్ష్మిలకు ఉచిత ప్రయాణం అనుమతించబడుతుంది. ఆసక్తి ఉన్నవారు ఈ వినియోగించుకోవాలని కోరారు.