వానాకాలం సీజన్‌లో రైతులు సాగు చేసిన పంటల వివరాలను పక్కాగా నమోదు చేయాలని పరిగి సహాయ వ్యవసాయ సంచాకులు లక్ష్మి కుమారి అన్నారు. ఆమె శుక్రవారం మండల పరిధిలోని దాదాపుర్ రైతువేదికను సందర్శించి, ఆన్లైన్లో నమోదు చేసిన పంట వివరాలను రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. అనంతరం రైతు వేదికలో రైతులతో సమావేశమై రుణమాఫీ గురించి చర్చించి రైతుల సందేహాలను నివృత్తి చేశారు.