వర్షాల పట్ల మండల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ మురళీధర్ పేర్కొన్నారు. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో ఎవరు కూడా బయటకు రాకూడదని, వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా చూసుకోవాలని అధికారులకు ఆయన తెలియజేశారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు.