జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన టిఎల్ఎమ్

1154చూసినవారు
జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన టిఎల్ఎమ్
తాండూర్ పట్టణం నంబర్ వన్ పాఠశాలలో జరిగిన మండల స్థాయి టీఎల్ ఎమ్ లో ప్రతిభ చూపిన టి ఎల్ ఎమ్ ను జిల్లా స్థాయి టి ఎల్ ఎమ్ మేళ కు ఎంపిక చేసినట్లు తాండూర్ మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ బుధవారం తెలిపారు. మండలంలో ఉన్న 53 ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల తెలుగు, ఇంగ్లీష్, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్ట్ ల లో "బొధనాభ్యాసన సామాగ్రి" మేళ లో పాల్గొని.. తాము బొదనాభ్యాసన ప్రక్రియ లో ఉపయోగిస్తున్న సామాగ్రిని ప్రదర్శించారు. ఉత్తమ మైన సామాగ్రిని నిపుణుల బృందం జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసింది. తెలుగులో సంకిరెడ్డి పల్లి పాఠశాల నుంచి ఉపాధ్యాయులు తిరుపతి, కరణ్ కోట్ పాఠశాల నుంచి భారతి, సాయిపుర్ పాఠశాల నుంచి అమృత రాణి ఉన్నారు. గణితంలో మల్క పూర్ పాఠశాల నుంచి స్వప్న కుమారి, సంకి రెడ్డి పల్లి పాఠశాల నుంచి రమాదేవి, బిజ్వర్ పాఠశాల నుంచి భీం రెడ్డి ఉన్నారు.
ఇంగ్లీష్ లో పాత తాండూర్ నంబర్ టూ ఉర్డుమీడియము పాఠశాల నుంచి భుష్ర, గౌతపూర్ పాఠశాల నుంచి మాధవి, గడి పాఠశాల నుంచి సీమ సుల్తానా ఉన్నారు. పరిసరాల విజ్ఞానంలో మల్కపూర్ పాఠశాల నుంచి శిరీష, మల్ రెడ్డి పల్లి పాఠశాల నుంచి హరి ప్రసాద్, అల్ల పూర్ పాఠశాల నుంచి వసుందర, కోటబాస్పల్లి పాఠశాల నుంచి శ్రీశైలం తయార్ చేసి ప్రదర్శించిన టి ఎల్ ఎమ్ ఎంపికైనట్లు విద్యాధికారి వెంకటయ్య గౌడ్ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్