కుక్కలు దవాఖానలో సంచరించడంతో రోగులు భయాందోళనకు గురైన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా దవాఖానలో చోటు చేసుకున్నది. స్థానిక జనరల్ దవాఖాన, ప్రాంగణంలో శుక్రవారం ఉదయం గ్రామ సింహాలు స్వైర విహారం చేశాయి. సుమారు ఏడు వీధి కుక్కలు దవాఖానలోకి ప్రవేశించాయి. ఓపీ రూమ్ వద్ద కూడా సంచరించాయి. అయినా వాటిని తరిమివేయకపోవడంతో రోగులు, వారి బంధువులు, అక్కడున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.