పోలీస్ శాఖలో క్రమశిక్షణ ఉల్లంఘన సహించం: డీజీపీ

59చూసినవారు
పోలీస్ శాఖలో క్రమశిక్షణ ఉల్లంఘన సహించం: డీజీపీ
పోలీస్ బెటాలియన్స్ లో ఆందోళన చేసిన వారిపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలంగాణ డీజీపీ జితేంధర్ తెలిపారు. సెలవులపై పాత పద్ధతిని అమలు చేస్తామని చెప్పినప్పటికీ మళ్ళీ ఆందోళనకు దిగడంపై పోలీస్ శాఖ సీరియస్ గా ఉందని తెలిపారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ ఉల్లంఘన సహించమని చెప్పారు. క్రమశిక్షణగల ఫోర్స్‌లో ఉండి ఆందోళనలు చేయడం సరికాదని చెప్పారు. ఆందోళన చేసిన వారిపై రెండు చట్టాల ప్రకారం చర్యలకు ఆదేశించామన్నారు.

సంబంధిత పోస్ట్