బంగ్లాదేశ్​లో హింస.. 100మంది మృతి

64చూసినవారు
బంగ్లాదేశ్​లో హింస.. 100మంది మృతి
బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు, అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య అదివారం జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో 14 మంది పోలీసులు సహా సుమారు 100 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. ఆదివారం నుంచి శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చిన నిరసనకారులు పోలీసులు, ప్రభుత్వాధికారులు తమకు మద్దతుగా నిలవాలని కోరారు.

సంబంధిత పోస్ట్