నెదర్లాండ్స్‌కు చెందిన హైనికెన్(Heineken) ప్రపంచంలోని అతి పెద్ద బీర్ తయారీ కంపెనీలలో ఒకటి. ఇప్పుడు ఈ కంపెనీ భారతదేశంలో తన ఉనికిని బలపరిచే దిశగా అడుగులు వేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావోలో బీర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ₹2,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని బీవరేజెస్ తయారీ రంగంలో ముందుకు తీసుకెళ్లడానికి కీలకంగా మారనుంది.