ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డాన్స్ చేశారు. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ ఫీల్డింగ్ చేస్తూ సరదాగా గ్రౌండ్‌లో డాన్స్ చేశారు. నడుచుకుంటూ వెళ్తూనే కోహ్లీ అద్భుతంగా డాన్స్ చేశారు. ఆడియన్స్ వైపు తిరిగి కోహ్లీ డాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.