చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లీ

80చూసినవారు
చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లీ
ఐపీఎల్‌ 2024లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు విరాట్‌ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. రియాన్ పరాగ్ క్యాచ్ అందుకున్న కోహ్లీ ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన నాన్‌ వికెట్‌కీపర్‌ ఫీల్డర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో విరాట్‌ మిస్టర్‌ ఐపీఎల్‌ సురేశ్‌ రైనా రికార్డును బద్దలుకొట్టాడు. రైనా 205 మ్యాచుల్లో 109 క్యాచ్‌లు పట్టగా.. విరాట్‌ 242 మ్యాచ్‌ల్లో 110 క్యాచ్‌లు పట్టి రికార్డ్ నెలకొల్పాడు.

సంబంధిత పోస్ట్