టాప్‌లోకి దూసుకొచ్చిన విరాట్, రోహిత్

578చూసినవారు
టాప్‌లోకి దూసుకొచ్చిన విరాట్, రోహిత్
భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో సత్తాచాటారు. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో రాణించిన వీరిద్దరు తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నారు. కోహ్లి మూడు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి దూసుకొచ్చాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 10వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక టాప్-5 ర్యాంకింగ్స్‌లో కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్, లబుషేన్, డారిల్ మిచెల్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్