క్రికెట్ ఆడుతూ కుప్పకూలి చనిపోయాడు (వీడియో)

564019చూసినవారు
యూపీ నోయిడాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. వికాస్ నేగి (34) అనే ఇంజినీర్ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. బ్యాటింగ్ చేస్తున్న ఉమేష్‌ను కలిసేందుకు నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న వికాస్ నేగి వెళ్లాడు. ఆ సమయంలో పిచ్ మధ్యలోనే వికాస్ అకస్మాత్తుగా కుప్పకూలాడు. వికాస్‌ను హుటాహుటిన సహచరులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వికాస్ గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్