రాష్ట్రాల వారీగా ఓటింగ్‌ శాతం ఇలా!

52చూసినవారు
రాష్ట్రాల వారీగా ఓటింగ్‌ శాతం ఇలా!
సార్వత్రిక ఎన్నికలకు మూడో విడత పోలింగ్‌ కొనసాగుతున్నది. ఈ విడుతలో 11 రాష్ట్రాల్లోని 93 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 17.24 కోట్ల మంది ఓట్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 1351 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 120 మందికిపైగా మహిళలు ఉన్నారు. ఇక పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటల వ్యవధిలో మొత్తం 10.57 శాతం మేర పోలింగ్‌ నమోదైంది. ఇక బెంగాల్‌లో 14.60 శాతం మేర పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్