ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ బూత్ లో నేడు ఓటింగ్‌

82చూసినవారు
ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ బూత్ లో నేడు ఓటింగ్‌
ప్రపంచంలోనే అత్యంత ఎతైన పోలింగ్‌ స్టేషన్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 15,256 అడుగుల ఎత్తులో ఉన్న తాషిగంగ్‌ గ్రామంలో నేడు తుది దశ పోలింగ్ జరుగుతోంది. భారత్‌- చైనా వాస్తవాధీన రేఖ సమీపంలో ఉన్న ఈ గ్రామం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా గుర్తింపు పొందింది. మండి నియోజకవర్గం, స్పితి లోయ ప్రాంత ప్రజలు ఇక్కడ ఓటు వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్