ఖగోళ పరిశోధనలకు అతిపెద్ద కెమెరా

74చూసినవారు
ఆస్ట్రోనమీ చరిత్రలోనే అతిపెద్దదైన LSST కెమెరా అంతరిక్ష పరిశోధనలకు సిద్ధమైంది. దీనిని రూబిన్ అబ్జర్వేటరీ సిమోనీ సర్వే టెలిస్కోప్లో విజయవంతంగా అమర్చారు. ఈ టెలిస్కోప్ చిలీలోని సెర్రో పచోన్ పర్వతంపై సముద్రమట్టానికి 8900 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కెమెరా బరువు 3 మెట్రిక్ టన్నులు కాగా 3.2 గిగాపిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంది. కాలిఫోర్నియాలోని SLAC ల్యాబ్ 20 ఏళ్ల పాటు శ్రమించి దీనిని తయారుచేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్