ఘోర ప్రమాదం.. గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి

12649చూసినవారు
హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధి బాబుల్ రెడ్డి నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. వర్షంతో పాత గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ప్రమాదంలో బాలిక 8(నూర్ జన్), బాలుడు 3(ఆసిఫ్ పర్వీన్) మృతిచెందగా.. మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. మృతులను బిహార్ వాసులుగా గుర్తించారు. నలుగురు చిన్నారులు ఇంటి ముందు ఆడుకుంటుండగా పాత గోడ కూలింది. వెంటనే చికిత్స కోసం స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్