జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ రాచర్ల ప్రభాకర్ గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భముగా ఆయన సంవత్సరీకం కార్యక్రమం ఆదివారం జరుగగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై ప్రభాకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టుగా ప్రభాకర్ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. సమాజంలో అన్ని కోణాల్లో అనేక వార్తలు రాసి కీర్తి గడించారని కొనియాడారు.