భూపాలపల్లి మండలం, కమలాపూర్ గ్రామానికి చెందిన చందన(32), కొందరు మహిళలు కలిసి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో అప్పు తీసుకున్నారు. తన భర్త, పిల్లల అనారోగ్య పరిస్థితుల రీత్యా చందన డబ్బులు కట్టలేకపోయింది. దానితో ఆ ఫైనాన్సియర్ ఒత్తిడి తీసుకురావడంతో డిసెంబర్ 6 న గడ్డి మందు తాగింది. తన భార్య పరిస్థితి చూసి ఆందోళనకు గురైన దేవేందర్ 20న ఉరి వేసుకున్నాడు. చికిత్స పొందుతున్న చందన మంగళవారం మృతి చెందినది.