భూపాలపల్లి మంజూనగర్ లోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దేవాలయంను ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవడానికి అధికారులు వస్తున్నారన్న సమాచారం మేరకు శనివారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తోపాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీగా ఆలయానికి చేరుకున్నారు. అధికారులను గుడి ప్రాంగణంలో అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఫైల్స్ పట్టుకొని ఎలా వస్తారని అధికారులను ప్రశ్నించారు.