వాహనాల డ్రైవర్లతో పాటు ప్రజలు రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రమాదాలను నివారించాలని భూపాలపల్లి జిల్లా కాటారం సీఐ నాగార్జునరావు అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం కాటారం పోలీస్ స్టేషన్ ఆవరణలో మండలంలోని సుమారు 200మంది ఆటో డ్రైవర్లకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించొద్దని, మద్యం తాగి వాహనాలు నడపొద్దని అన్నారు.