జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ వస్తున్నారని భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి అన్నారు. వారు మాట్లాడుతూ సోమవారం మధ్యాహ్నం ౦1: 00 గంటకు గణపురం మండలం వెళ్తుర్ల పల్లి నుండి కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లి, మధ్యాహ్నం 02: 00గంటలకు కలెక్టర్ తో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుంది అన్నారు.