దేవరుప్పుల: మహిళా భద్రత చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి
మహిళల కోసం రూపొందించిన భద్రత చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) జనగాం జిల్లా బాలికల విభాగం కన్వీనర్ దాసగాని సుమ అన్నారు. గురువారం దేవరుప్పులలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో మహిళలు, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కీర్తన, మానస, ధన్వంతి, చందన, కావ్యలు పాల్గొన్నారు.