డోర్నకల్ మండల కేంద్రంలో సోమవారం ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేశారు. ఎస్ఎఫ్ఐ డోర్నకల్ మండల కన్వీనర్ మౌలానా మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమాల పోరాటాల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ అన్నారు. విద్యార్థుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సాయి, లోకేష్, రామ్ చరణ్, వరుణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.