ఘనంగా పాఠశాలల్లో బతుకమ్మ వేడుకలు (వీడియో)

73చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి ఎంపీపీఎస్, జడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో మంగళవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పూలను పేర్చి బతుకమ్మలను తయారు చేశారు. పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ కోలాటాలు ఆడి తిరుగుతూ సందడి చేశారు. దీనితో పాఠశాలల్లో సందడి వాతావరణం నెలకొని ఒక పండుగలా మారింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్