డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఫ్యూజులు, స్టార్టరును గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారని గురువారం గ్రామానికి చెందిన రైతు కస్నబోయిన వెంకటేశ్వర్లు అన్నారు. ఉదయం పొలం వద్దకు పోయి చూసేలోపు కాలిపోయి ఉన్నాయని వారు తెలిపారు. ఇంతకుముందు నెలక్రితం పోల్ నుండి మోటార్ వరకు 150 మీటర్ల కాపర్ వైర్‌ను చోరీ చేసి, ఫ్యూజ్‌లు, స్టార్టరును పగలగొట్టారని వారు తెలిపారు.