డోర్నకల్ మండలం రావిగూడెం గ్రామంలోని ధనియాకుల నారాయణ వ్యవసాయ పొలంలో బుధవారం ట్రాక్టర్ బురదలో దిగబడింది. 3గంటలు కష్టపడి ట్రాక్టర్ ని బయటకు తీశారు. డ్రైవర్ వినూత్నంగా ఆలోచించి చెట్టు నుంచి ఐరన్ వీల్స్ కి తాడుని కట్టి బయటకు తీశారు. దీనితో డ్రైవర్ ని స్థానికులు మెచ్చుకున్నారు. వరిని సాగు చేసేటప్పుడు పొలాన్ని దున్నటానికి ట్రాక్టర్ డ్రైవర్స్ ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.