డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలోని శాంతినగర్ లో పి హెచ్ సి సబ్ సెంటర్ భవన నిర్మాణం పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ విప్ డాక్టర్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ తో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన అధికారులు భవన నిర్మాణ పనులను నేడు ప్రారంభించడంతో ఏల్లవుల హరికృష్ణ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.