మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నర్సీపట్నం నుండి వరంగల్ కి గంజాయిని సోమవారం విశాఖపట్నంకి చెందిన నిందితుడు గోపి తరలిస్తున్నాడు. సమాచారం అందుకున్న డోర్నకల్ పోలీసులు అక్కడికి చేరుకొని సుమారు రూ. 1, 75, 000/- విలువైన 7. 5 కేజీల గంజాయిని, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు.