డోర్నకల్ మండలం రావిగూడెం శివారులోని ఓ వెంచర్ వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్టీసీ ఎక్సప్రెస్ బస్ మహబూబాబాద్ నుండి ఖమ్మంకు వెళ్తుండగా ఒక్క సారిగా గేదె అడ్డుగా రాగా గేదెను ఢీకొట్టింది. బస్ డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేయడం వల్ల వెనుకాలున్న ఆటోలోని ఓ ప్రయాణికుడికి స్వల్ప గాయాలవ్వగా ఆసుపత్రి తరలించారు. నెంబర్ ప్లేట్ ఊడిపోయింది. ఈ ప్రమాదంలో గేదె మృతి చెందింది.