డోర్నకల్ మండలం వెన్నారం గ్రామానికి చెందిన వార్డు మెంబర్ వలదాసు ఉపేందర్ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరారు. మాజీ సర్పంచ్ వెంకన్న ఆయనకు సోమవారం బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజాబలం చూపిస్తామని, అధికారంలో లేకున్నా పోరాటాలు చేస్తామని, గ్రామ అభివృద్ధి కోసం పోరాడేందుకు సిద్ధమన్నారు. మా బలం చూపిస్తామని, ప్రజలు మావైపే ఉన్నారని వెంకన్న గుర్తుచేశారు.