జాతీయ న్యాయ దినోత్సవం లేదా జాతీయ రాజ్యాంగ దినోత్సవం నేడు అనగా నవంబర్ 26వ తేదీన జరుపుకోవడం ఆనవాయితీ. 1949 నవంబర్ 26 వ తేదీన భారత రాజ్యాంగ ముసాయిదా పత్రాలపై సంతకాలు చేసి ఆమోదించారు. ఆ తరువాత స్వాతంత్ర సమరంలో చారిత్రాత్మక తేదీ అయిన జనవరి 26 నుండి రాజ్యాంగం అమలులోకి వస్తే బాగుంటుందనే అభిప్రాయంతో జనవరి 26న అమలు దినోత్సవంగా రిపబ్లిక్ డే జరుపుకుంటాము. అయితే 1979 నుండి అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచనమేరకు నవంబర్ 26న న్యాయ దినోత్సవం జరుపుకోవడం మొదలైంది. రాజ్యాంగము దేశ అత్యున్నత చట్టంగా పిలువబడుతుంది. రాజ్యాంగ పరిరక్షణ ఉన్నత న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది. అలాగే రాజ్యాంగ మౌలిక రూప భావన లైన జాతీయ లక్ష్యాలు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం లౌకిక సమగ్రత సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం రాజకీయ న్యాయం వీటన్నిటిని పరిరక్షించే బాధ్యత న్యాయవ్యవస్థ చూస్తుంది. తద్వారా రాజ్యాంగ పరిరక్షణ జరుపబడుతుంది పౌరునికి రాజ్యంగం అందించిన హక్కులు సదుపాయాలు ఏ ఆటంకం లేకుండా అందటంలో న్యాయవ్యవస్థ రక్షకుడుగా ఉండి సహాయ పడుతుంది.
కాబట్టి రాజ్యాంగం ఆమోదించిన రోజు నవంబర్ 26వ తేదీ ని జాతీయ న్యాయ దినోత్సవంగా, రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం.
మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గల పాఠశాలలు అన్నిట్లో రాజ్యాంగ ప్రతిజ్ఞ ఉపాధ్యాయులు విద్యార్థులు చేశారు వర్క్ ఫ్రొం హోమ్ గల ఉపాధ్యాయులు ఇంటి నుంచే తమ ప్రతిజ్ఞ చేశారు పిల్లల్లో రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించారు. రాజ్యాంగ సారమంతా పీఠిక లో పొందుపరచబడింది అని, పీఠికఈ జాతి సాధించవలసిన లక్ష్యాలను నిర్దేశిస్తుందని పీఠికనందు పొందుపరచబడిన భావాల సాధనే ప్రభుత్వాల పౌరుల యొక్క లక్ష్యమని ఉపాధ్యాయులు తెలిపారు. సౌభ్రాతృత్వము, లౌకిక భావాలు పెంపొందించుకుని దేశభక్తిని పొందు పరచుకొని మంచి పౌరులుగా ఎదగాలని తోడేళ్ళ గూడెం ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఆ తర్వాత పీఠిక ప్రతిజ్ఞ, రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ పాఠశాలల్లో జరిపారు.