యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం మరిపెడ మండల కేంద్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరబాబు మాట్లాడుతూ.. కేంద్రంలో లక్షల రూపాయలకు నీట్ పరీక్ష పత్రాలు లీకేజి చేసి 24లక్షల మంది జీవితాలతో ఎన్టీఏ ఏజెన్సీ చెలగాటం ఆడిందని వారు అన్నారు. రేపు జరిగే దేశవ్యాప్త విద్యా సంస్థల బందుకు ప్రైవేట్ యాజమాన్యాలు, విద్యార్థులు స్వచ్ఛందంగా సహకరించగలరని వారు పిలుపునిచ్చారు.