వార్షికోత్సవం సందర్బంగా సీరోల్ మండలం మన్నెగూడెం గ్రామంలోని శ్రీ పార్వతి రామ లింగేశ్వర శివాలయంలో శివపార్వతుల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు. స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలను, భజన కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో భక్తి శ్రద్దలతో పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ప్రణీత్, గ్రామ ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.