రోడ్డుపై ఈడ్చుకెళ్ళిన కారు..
హనుమకొండ – అంబేద్కర్ సర్కిల్ నుంచి ఓల్డ్ బస్ డిపో వెళ్లే రోడ్డులో పీహెచ్ వర్కర్ రామంచ సమ్మక్క చీపురుతో రోడ్డు పక్కన ఊడుస్తున్న సమయంలో అటుగా వచ్చిన ఓ కారు ఆమెను ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమె రోడ్డుపై ఆర్తనాదాలు పెడుతున్న కానీ అటుగా వెళ్లే వారు పట్టించుకోలేదు. ఇంతలో బైక్ పై వచ్చిన ఒకతను గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించారు.