జనగామ పట్టణంలోని వివర్స్ కాలనీకి చెందిన అంబాటి సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి తనయుడు అంబటి బాల రాజు మిగిలిన ఆహారం వృధా చేయకుండా అనాథలకు ఆకలి తీర్చేందుకు బుధవారం అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనగామ రైల్వే స్టేషన్, అండర్ బ్రిడ్జి కింద ఉన్న అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మనీ, అమ్మ ఫౌండేషన్ ముఖ్య సలహాదారులు వంగ బీమ్ రాజ్ మాట్లాడుతూ మిగిలిన ఆహారం వృథా చేయకుండా మీ మీ ప్రాంతాలలో గ్రామాలలో పట్టణాలలో ఆకలితో అలమటించే వారికి నిరుపేద కుటుంబాలకు ఆహారాన్ని అందజేయాలని ఆహారాన్ని వృథా చేయొద్దని కోరారు. ఈ సేవా కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ టీం సభ్యులు బింగి నరసింహులు, సల్ల మహేష్, తుంగ కౌశిక్, కమల్, వెంకటేష్, రాహుల్, సాయి, తదితరులు పాల్గొన్నారు.