జనగామ జిల్లాలోని చేర్యాల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నల్లనాగుల శ్వేత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. హుటాహుటిన జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరబాద్ కు తరలించారు. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు సమాచారం. నల్లనాగుల శ్వేత గత ఐదు నెలల క్రితం చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా నియామకం అయ్యారు.