గ్రామ పంచాయతీ సిబ్బంది అర్ధనగ్న ప్రదర్శన

696చూసినవారు
గ్రామ పంచాయతీ సిబ్బంది అర్ధనగ్న ప్రదర్శన
తరిగొప్పుల మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు రాష్ట్ర జెఏసి పిలుపు మేరకు ఎంపీడీఓ కార్యాలయం ముందు చేపట్టిన సమ్మె బుధవారానికి ఏడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా తరిగొప్పుల గౌరవ అధ్యక్షులు నారోజు రాంచంద్రం మాట్లాడుతూ రాష్ట్ర జెఎసి పిలుపుమేరకు చేస్తున్నటువంటి సమ్మె నేటితో ఏడవ రోజు చేరుకున్న ప్రభుత్వం ఇంకా మా పట్ల సానుకూల నిర్ణయం తీసుకోకపోవడం మంచి పద్ధతి కాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్